![]() |
![]() |

'ఎఫ్-2', 'ఎఫ్-3' సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం, పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా, ఆ పరంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. కథాకథనాలు రొటీన్ గా ఉన్నప్పటికీ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే, కాసేపు నవ్వుకోవచ్చు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. మొదటి రోజు మేజర్ సిటీలలో దాదాపు షోలు అన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ని ఈ చిత్రం సాధించింది. (Sankranthiki Vasthunam)
'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సినిమాకి వచ్చిన టాక్, బుకింగ్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఈ సంక్రాంతి సీజన్ లో ఈ మూవీ మంచి వసూళ్లనే రాబట్టే ఛాన్స్ ఉంది. ఫుల్ రన్ లో రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వెంకటేష్ కెరీర్ లో టాప్ గ్రాసర్స్ గా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'ఎఫ్-2', 'ఎఫ్-3' సినిమాలు నిలిచాయి. 'ఎఫ్-2' రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా, 'ఎఫ్-3' రూ.90 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు ఆ రెండు సినిమాలను దాటుకొని 'సంక్రాంతికి వస్తున్నాం' టాప్ లో నిలిచే ఛాన్స్ ఉంది.

![]() |
![]() |