![]() |
![]() |

తమిళనాట ఉన్న అగ్ర హీరోల్లో విశాల్(Vishal)కూడా ఒకడు.2004 లో సినీ రంగ ప్రవేశం చేసిన విశాల్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని సంపాదించుకున్నాడు.ఆ సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యి కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని పొందాడు.అలాంటి విశాల్ రీసెంట్ గా జరిగిన తన అప్ కమింగ్ మూవీ 'మదగజరాజ' మూవీ ఫంక్షన్ కి హాజరయ్యాడు.అందులో విశాల్ బాగా సన్నబడి ఉండటంతో పాటుగా బాగా వణుకుతూ కనిపించాడు.దీంతో అయన హెల్త్ పై రకరకాల వార్తలు వచ్చాయి.కొంత మంది సినిమా వాళ్ళు మాత్రం విశాల్ కి వైరల్ ఫీవర్ రావడం వలన అలా ఉన్నాడని స్పందించడం జరిగింది.
ఇప్పడు లేటెస్ట్ గా విశాల్ ఆరోగ్యంపై ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi sarathkumar)స్పందిస్తు విశాల్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు చూసాను.ఆయన త్వరగా కోలుకోవాలని,మంచి ఆరోగ్యంతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.గతంలో విశాల్,వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం నడిచినట్టుగా పలు కధనాలు వచ్చిన నేపథ్యంలో విశాల్ ఆరోగ్యంపై వరలక్ష్మి మాట్లాడిన మాటలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.ఇక 'మదగజరాజ' లో వరలక్ష్మి కూడా నటించింది.ఈ సందర్భంగా సినిమా గురించి కూడా ప్రస్తావిస్తు విశాల్ ఈ సినిమాలో చాలా కష్టపడి నటించాడు.8 ప్యాక్ బాడీతో కనిపిస్తాడు.పైగా ఈ మూవీ నా సినీ కెరీర్ లో రెండవ చిత్రం అని కూడా చెప్పుకొచ్చింది.
![]() |
![]() |