![]() |
![]() |

పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హీరోగా భీమనేని శ్రీనివాస్(Bhimineni srinivas)దర్శకత్వంలో వచ్చిన సుస్వాగతం లోని 'హ్యాపీ హ్యాపీ బర్త్ డే' సాంగ్ తో పాటు నువ్వే కావాలిలోని 'అనగనగ ఆకాశం ఉంది',సూర్య వంశంలోని 'రోజావే చిన్ని రోజావే' వంటి పాటలని ఆలపించిన గాయకుడు పి.జయచంద్రన్(p.Jayachandran)మలయాళ చిత్ర సీమకి చెందిన జయచంద్రన్ మలయాళంతో పాటు తెలుగు,తమిళ,కన్నడ,హిందీ భాషల్లో ఎన్నోఅద్భుతమైన పాటలని ఆలపించి అశేష ప్రేక్షకులని అలరించారు.
గత కొన్నాళ్ల నుంచి జయచంద్రన్( అనారోగ్యంతో బాధపడుతున్నాడు.ఈ మేరకు కేరళలోని త్రిసూర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స కూడా తీసుకుంటున్నాడు.కానీ నిన్నరాత్రి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడవడం జరిగింది.16000 వరకు పాటలు పాడిన జయచంద్రన్ ఉత్తమ నేపధ్య గాయకుడుగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఐదు సార్లు కేరళ స్టేట్ అవార్డులు కూడా గెలుచుకున్నాడు.ఆయనకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.
![]() |
![]() |