![]() |
![]() |
.webp)
మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ గెలుచుకున్న ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)2013 లో బాలీవుడ్ లో తెరకెక్కిన సింగ్ సాబ్ గ్రేట్ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది.ఆ తర్వాత కూడా పలు హిందీ చిత్రాల్లో చేసిన ఊర్వశి తెలుగులోకి మాత్రం చిరంజీవి(Chiranjeevi)హీరోగా తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య'లో ని ఒక స్పెషల్ సాంగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.'వేర్ ఇస్ ది పార్టీ బాసు వేర్ ఇస్ ది పార్టీ, అని చిరు పక్కన సూపర్ గా డాన్స్ చేసింది. ఆ తర్వాత అఖిల్ ఏజెంట్ లోని వైల్డ్ సారా, బ్రో' మూవీలోని' మై డియర్ మార్కండేయ' రామ్ పోతినేని స్కంద లో కల్ట్ మామ, వంటి ప్రత్యేక గీతాల్లో సూపర్ గా డాన్స్ చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ప్రస్తుతం నందమూరి లయన్ బాలకృష్ణ(Balakrishna)హీరోగా తెరకెక్కన డాకు మహారాజ్ లో'దబిడి దబిడి' సాంగ్ లో చేసింది.
కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ పాట బాలయ్య అభిమానులని, ప్రేక్షకులని విశేషంగా అలరిస్తుంది.కొంత మంది మాత్రం ఈ పాటలోని డాన్స్ మూమెంట్స్ ని ట్రోల్ చేస్తున్నారు.ఇప్పుడు ఆ ట్రోల్స్ కి ఊర్వశి సమాధానమిస్తు 'ఏదీ సాధించని కొందరికి అవిశ్రాంతంగా పని చేసేవారిని విమర్శించే అర్హత ఉందని భావించడం విడ్డూరం,నిజమైన శక్తి ఇతరులను కూల్చివేయడం కాదు, వారు ఎదిగేలా వారి గొప్పతనాన్ని ప్రేరేపించడం అని సోషల్ మీడియా వేదికగా తెలియచేసింది.
.webp)
ప్రస్తుతం ఊర్వశి చేతిలో బ్లాక్ రోజ్,వెల్ కమ్ తో జంగిల్,కసూర్ అనే సినిమాలు ఉన్నాయి.కన్నడ,తమిళ చిత్రాల్లో కూడా చేసిన ఊర్వశి మ్యూజిక్ కి సంబంధించిన పలు ప్రైవేట్ వీడియోస్ కూడా చేసి మంచి గుర్తింపుని పొందింది.
![]() |
![]() |