![]() |
![]() |
.webp)
గత కొంత కాలంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)వరుస పరాజయాలని చవి చూస్తున్నాడు.ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham thinnanuri)దర్శకత్వంలో తన కొత్త మూవీ చేస్తున్నాడు.వీడీ 12(Vd12)గా తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్ టైనర్ పతాకంపై నాగవంశీ(Naga vamsi)భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.మార్చి 28 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.ఈ మేరకు మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది.
ఇక విజయ్ దేవర కొండ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటాడనే విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇనిస్టాగ్రమ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసాడు.అందులో విజయ్ మాట్లాడుతు కొంత మంది మనకి ఫోన్ చేసి మీ పాత ఫ్రెండ్ ని అని,లేదా మీ నాన్న స్నేహితుడిని అని మీ దగ్గర డబ్బులు కాజేయాలని చూస్తారు.ఫేక్ మెసేజ్ లతో ఎక్కువ డబ్బులు మన అకౌంట్ లో పడినట్టుగా చెప్పి మన డబ్బులని దోచుకుంటారు.ఉదాహరణకి 5000 అకౌంట్ లో పడాల్సింది 50000 పడినట్టుగా ఫేక్ మెసేజ్ ని సృష్టిస్తారు.నా స్నేహితుడి విషయంలో ఒక సారి ఇలాగే జరిగింది.అందుకే యుపిఐ పేమెంట్ సురక్షితం. మీ శ్రేయోభిలాషిని, మీ స్నేహితుడ్ని అంటూ మభ్య పెట్టి డబ్బులు దోచేసే వారి విషయంలో జాగ్రతగా ఉండండి.ఎవరైనా మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తే నేను మూర్ఖుడు ని కాదని చెప్పండి అని పేర్కొన్నాడు.
![]() |
![]() |