![]() |
![]() |

సంధ్య థియేటర్ మహిళ మృతి కేసులో అల్లు అర్జున్(allu arjun)కి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.దీంతో నిన్న నైట్ జైలులో ఉన్న అల్లు అర్జున్ ఈ రోజు ఉదయమే తన ఇంటికి వచ్చాడు.ఇక అల్లు అర్జున్ రాకతో పలువురు సినీ ప్రముఖులు అయన ఇంటికి చేరుకొని తమ సంఘీభావాన్ని తెలియచేస్తున్నారు.
తాజాగా అల్లుఅర్జున్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)ఫోన్ చేసి అరెస్ట్ విషయంపై మాట్లాడినట్టుగా తెలుస్తుంది.అల్లు అర్జున్,ఎన్టీఆర్ లు సుదీర్ఘ కాలం నుంచి ఒకరికొకరు 'బావ' అని ఆప్యాయంగా పిలుచుకోవడంతో పాటుగా తమ తమ ఇళ్లల్లో జరిగే అన్ని శుభకార్యాలకి హాజరవుతుంటారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ చిత్రం వార్ 2(war 2)షూటింగ్ కి సంబంధించి ముంబై లో ఉన్నాడు.
![]() |
![]() |