![]() |
![]() |

ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళి(posani krishna murali)ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నేను ఇక రాజకీయాల గురించి దూరంగా ఉంటున్నాను.ఏ పార్టీ గురించి పొగడటం గాని, తిట్టడం గాని చెయ్యను.రాజకీయాల వలన ఫ్యామిలీకి సరైన సమయం కేటాయించకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఈ విషయంపై చిరంజీవి(chiranjeevi)పవన్ కళ్యాణ్(pawan kalyan)అల్లు అర్జున్(allu arjun)అభిమాని, బేబీ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి ఎస్ కె ఎన్(skn)ఎలక్షన్స్ కి ముందు ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గురించి పోసాని అత్యంత దారుణంగా మాట్లాడిన వీడియోల్ని షేర్ చేస్తూ 'సార్ ఇప్పుడు అందరికి అన్ని గుర్తుకొస్తాయి. కానీ విరమిస్తున్నా అని నటించే ముందు, కనీసం మీరు మా అభిమాన నాయకుడు గురించి,ముఖ్యంగా ఇంట్లోని పసి పిల్లల గురించి మాట్లాడిన నీచమైన సంస్కారం లేని వ్యాక్యలకి చింతిస్తున్నాను, లేదా క్షమించండి అని అడిగి ఉంటే కనీసం మీ మాటలని నమ్మాలనిపించేది.
.webp)
పొరపాటున మాట్లాడిన వ్యక్తి కాదు మీరు. ఎన్నో సార్లు నానా దుర్భాషలాడుతూ మాట్లాడారు .మీ మాటలు వినలేక అందరు చెవులు మూసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.మా అభిమానుల హృదయాలు మాత్రం మీ మాటల వల్ల చాలా గాయపడ్డాయి. మీ ఒక్కళ్ళవే కాదు అందరవి కుటుంబాలే.ఎవరి పిల్లలు అయినా కూడా పిల్లలే. మీరు మాత్రం క్షమార్హులు కాదని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసాడు.
![]() |
![]() |