![]() |
![]() |

రవితేజ(ravi teja)హీరోగా హరీష్ శంకర్(harish shankar)దర్శకత్వంలో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన భామ భాగ్యశ్రీ బోర్సే(bhagyashri borse)ఆ సినిమా పరాజయం చెందినప్పటికీ భాగ్యశ్రీ నటనకి మాత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి పేరు వచ్చింది.విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న మూవీలోను భాగ్యశ్రీ నే హీరోయిన్ గా చేస్తుంది.
ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram potineni)హీరోగా మైత్రి మూవీస్ నిర్మిస్తున్న నూతన చిత్రంలోను నటించబోతుంది.అందం,తెలివి కలగలిగిన లేటెస్ట్ సంచలనం భాగ్యశ్రీ బోర్సే తో మా అందమైన జర్నీ అంటూ మేకర్స్ అధికారకంగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యడం జరిగింది.నవంబర్ 21న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలుకానుంది.

నవీన్ పోలిశెట్టి, అనుష్క ల జంటగా గతంలో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకి దర్శకత్వం వహించిన మహేష్(mahesh)ఈ సినిమాకి దర్శకుడు కాగా తెలుగు చిత్ర సీమకి చెందిన పలువురు అగ్ర తారలు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ ఆశించినంతగా విజయాన్ని సాధించని నేపథ్యంలో రామ్ పోతినేని అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు.
![]() |
![]() |