![]() |
![]() |

కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వార్ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు వెళ్లడం ఈ వివాదానికి కారణమైంది. అప్పటి నుంచి మెగా అభిమానులు అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ సైతం అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. 'పుష్ప-2' సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఈ వివాదం మరింత ముదురుతోంది. (Pushpa 2 The Rule)
రీసెంట్ గా 'పుష్ప-2' ట్రైలర్ లాంచ్ పాట్నాలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఎందరో సినీ సెలబ్రిటీలు 'పుష్ప-2' ట్రైలర్ ని ప్రశంసిస్తూ ట్వీట్ లు చేశారు. కానీ మెగా హీరోలు మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో మెగా వర్సెస్ అల్లు వార్ తారాస్థాయికి చేరింది. మాకు మెగా సపోర్ట్ అక్కర్లేదని బన్నీ ఫ్యాన్స్ అంటుంటే, ఇక నుంచి అల్లు అర్జున్ సినిమాలు చూసేది లేదని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. డిసెంబర్ లో విడుదలవుతున్న 'పుష్ప-2'ని పట్టించుకోకుండా, జనవరిలో విడుదలవుతున్న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'ని మాత్రమే పట్టించుకుంటామని మెగా అభిమానులు అంటున్నారు. దీంతో మెగా వర్సెస్ అల్లు వార్ కాస్తా.. 'పుష్ప-2' వర్సెస్ 'గేమ్ ఛేంజర్' అన్నట్టుగా మారుతోంది. (Game Changer)
'పుష్ప-2' అనేది సీక్వెల్ హైప్ తో వస్తున్న సినిమా. కనీసం రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తుందని, అన్నీ అనుకూలిస్తే రూ.1500 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం కూడా పెద్ద లెక్క కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి మరోలా ఉంది. 'ఆచార్య' తర్వాత రామ్ చరణ్, 'ఇండియన్-2' తర్వాత శంకర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'గేమ్ ఛేంజర్'పై కొంత అనుమానాలు ఉన్నాయి. అయితే టీజర్ మాస్ ని మెప్పించడంతో పాటు, సంక్రాంతి సీజన్ లో విడుదలవుతుండం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. ఈ మూవీ రిజల్ట్ అనేది రామ్ చరణ్ కి కీలకం. చరణ్ పాన్ ఇండియా హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న, 'పుష్ప-2' ప్రభంజనానికి ధీటైన సమాధానం చెబుతూ తాను నిలబడాలన్న కనీసం రూ.400-500 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం, ఈ మొత్తం రాబట్టడం 'గేమ్ ఛేంజర్'కి పెద్ద విషయమేమీ కాదు.
![]() |
![]() |