![]() |
![]() |
.webp)
2021 లో సుమంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' అనే మూవీతో తెలుగు చలన చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన నటి మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) గుంటూరు కారం, ది గోట్,లక్కీ భాస్కర్, మట్కా లాంటి వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిన మీనాక్షి ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న'మెకానిక్ రాకీ' అనే మూవీలో చేస్తుంది.ఎస్ఆర్ టి పతాకంపై పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా ఈ నెల 22 న విడుదల కానుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో మెకానిక్ రాకీ ప్రమోషన్స్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లో మీనాక్షి తను ఇప్పటి వరకు వర్క్ చేసిన హీరోల గురించి మాట్లాడుతు మహేశ్‌బాబు(mahesh babu)క్రమశిక్షణగా ఉంటారు.విజయ్(vijay)ఎప్పుడూ ఒకేలా ఉంటారు. దుల్కర్ (dulqur salman)వినయం అంటే నాకు ఇష్టం. వరుణ్ తేజ్(varun tej)ది పూర్తిగా జెంటిల్‌మ్యాన్ నేచర్.ఇక విశ్వక్ సేన్(vishwak sen)ఎప్పుడూ సరదాగా,ఎనర్జిటిక్‌గా ఉంటూ సెట్‌లో సందడి క్రియేట్ చేస్తుంటాడని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

![]() |
![]() |