![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ(krishna)నటనకి మాత్రమే వారసుడు కాదు.మంచి మనసుకి కూడా వారసుడు.కృష గారి లాగానే తన సొంత డబ్బుతో ఆపదలో ఉన్నఎంతో మందిని ఆదుకొని ఆపద్బాంధవుడు గా నిలుస్తున్నాడు.
వచ్చే నెల నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 వరకు విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్ నందు పద్దెనిమిది సంవత్సరాల
వయసు లోపు పిల్లలకు మహేష్ బాబు ఉచితంగా గుండె ఆపరేషన్స్ ని చేయించనున్నారు.ఇంగ్లాండ్ నుండి వస్తున్న అత్యంత ప్రతిభావంతమైన వైద్యుల చేత ఈ ఆపరేషన్స్ జరగనున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ఎవరి పిల్లలకైనా గుండె కి సంబంధించిన సమస్య ఉన్నా సరే పేర్లు నమోదు చేసుకోవచ్చు.చాలా కాలం నుంచి మహేష్ ఇలాంటి ఆపరేషన్స్ ని చేయిస్తూ వస్తున్నాడు.

సినిమాల విషయాలకి వస్తే ప్రస్తుతం రాజమౌళి(rajamouli)తో ప్రారంభం అయ్యే మూవీకి మహేష్ సన్నాహాలు అవుతున్నాడు. ఇండియాలోనే అత్యంత భారీ వ్యయంతో ఆ సినిమా తెరకెక్కనుంది.
![]() |
![]() |