Home

»

Latest News

మంచు మనోజ్ లాంటి కొడుకు కావాలి

Oct 22, 2024 11:33AM

అక్కినేని నాగార్జున హీరోగా శ్రీయా, గ్రేసీ సింగ్ హీరోయిన్లుగా 2002 లో వచ్చిన మూవీ సంతోషం.ఈ మూవీ ద్వారా తెలుగు తెరకి పరిచయమైన దర్శకుడు దశరధ్.మొదటి సినిమాతోనే సిల్వర్ జూబ్లీ జరుపుకున్న దర్శకుడుగా రికార్డు సృష్టించి  సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్, గ్రీకు వీరుడు, శౌర్య,శ్రీ వంటి చిత్రాలకి తెరకెక్కించాడు.దర్శకుడుగా మారక ముందు   కొన్నిచిత్రాలకి రచయితగాను పని చేసిన దశరద్ లవ్ యూ రామ్ అనే సినిమాకి నిర్మాతగాను వ్యవహరించడమే కాకుండా అందులో ఒక క్యారక్టర్ ని కూడా పోషించాడు.

రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మంచి మనోజ్ తో రెండు చిత్రాలు చేశాను.నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నాకు కొడుకు పుడితే అలాంటి వాడు కావాలని అనుకున్నాను.అంత ఎనర్జీ.మనోజ్ సొంతం. ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు.నా లైఫ్ లో కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. మనోజ్ నుంచి  రాబోయే మూవీ  మిరాయ్ చాలా పెద్ద విజయం సాధిస్తుంది.అదే విధంగా  ప్రభాస్ కూడా నాకు దగ్గరయ్యాడు. నా మనసుకు బాగా క్లోజ్ అయినా వ్యక్తులు ఆ ఇద్దరే అని చెప్పిన దశరద్ లవ్ యూ రామ్ వల్ల పెద్ద మొత్తంలో డబ్బు కూడా  పోగొట్టుకునని  చెప్పుకొచ్చాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com