Home

»

Latest News

హైకోర్టు ముందు హర్ష..అందరిలో టెన్షన్  

Oct 22, 2024 10:37AM

యూ ట్యూబర్ హర్ష(harsha sai)తనని లైంగికంగా వేధించడంతో పాటు, భారీ ఎత్తున డబ్బు కూడా కాజేసాడని మాజీ నటి మరియు  బిగ్‌బాస్‌ ఫేమ్‌ మిత్రాశర్మ(mitraww sharma) పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దీంతో హర్షసాయిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు మోదు చేసారు.అప్పట్నుంచి హర్ష పరారీలో ఉన్నాడు.

అజ్ణాతంలో ఉన్న హర్ష ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ని ఆశ్రయించాడు.తనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు  నమోదైన దృష్ట్యా  ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు.నేడు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది. దీంతో కోర్టు తీర్పుపై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది. మిత్ర శర్మ కొన్ని రోజుల క్రితం ఆర్ జె శేఖర్ బాషా పై కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ కేసులో కొన్ని రోజుల క్రితం  ఆర్‌.జె. శేఖర్‌బాషా కూడా అరెస్ట్ అయ్యాడు.తనపై  కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌లో   అసత్య ప్రచారాలు చేస్తున్నారని  మిత్రశర్మ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అరెస్ట్ చేసి   దాదాపు మూడు గంటపైగా విచారించారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com