Home

»

Latest News

కన్నడ స్టార్ సుదీప్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్!

Oct 20, 2024 3:13PM

కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సరోజ (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. సుదీప్ తల్లి సరోజ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. 

"ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీమతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని శ్రీ సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అంటూ సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com