![]() |
![]() |

ఎన్నో హిట్ సినిమాలకి సంగీతాన్ని సమకూర్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్(devi sri prasad)దేవి, వర్షం,మన్మధుడు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శంకర్ దాదా ఎంబీబీఎస్, మిర్చి, జల్సా, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను,ఎవడు,ఉప్పెన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలకి అద్భుతంగా ట్యూన్స్ ఇచ్చి ఆయా సినిమాల హిట్ రేంజ్ ని కూడా పెంచాడు. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల్ని కూడా అందుకున్నాడు.
ఈ నెల 19 న దేవి శ్రీప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మ్యూజికల్ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)ని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో దేవి కలిసి మ్యూజికల్ కార్క్యక్రమానికి రావాలని ఆహ్వానించాడు.ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(bhatti vikramarka)కూడా ఉండడంతో ఆయన్ని కూడా కార్యక్రమానికి రావాలంసిందిగా దేవి కోరాడు.దీంతో ఆ ఇద్దరు కూడా సానుకూలంగా స్పందినట్టుగా తెలుస్తుంది. ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్(bandla ganesh)కూడా దేవి తో పాటే సిఎం,డిప్యూటీ సిఎం ని కలిసాడు.
![]() |
![]() |