Home

»

Latest News

మా మనవడు సినిమాని హిట్ చెయ్యండి

Sep 27, 2024 2:42PM

కొన్నివందల సినిమాలకి రైటర్ గా పని చేసి రైటర్ అనే పదానికి స్టార్ డమ్ తెచ్చిన వాళ్ళల్లో పరుచూరి బ్రదర్స్(paruchuri brothers)మొదటి వరుసలో నిలుస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఈ మాట అక్షర సత్యమని పరుచూరి బ్రదర్స్ తో  వర్క్ చేసిన అగ్ర హీరోలందరు చాలా సందర్భాల్లో చెప్పారు. హీరోలని స్టార్స్ గా మార్చిన ఘనత కూడా వాళ్ళ సొంతం.

ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ మనవడు సుదర్శన్(sudarshan)హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. మిస్టర్ సెలబ్రిటీ అనే పేరుతో ఆల్రెడీ షూటింగ్ కి కూడా పూర్తి చేసుకున్న ఆ చిత్రం అక్టోబర్ 4 న విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ(paruchuri gopalakrishna)మిస్టర్ సెలబ్రిటీ రిలీజ్ పోస్టర్ ని ఆవిష్కరించాడు. అనంతరం ఆయన  మాట్లాడుతు మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడు సుదర్శన్ ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. అనంతరం పరుచూరి  వెంకటేశ్వరరావు(paruchuri venkateswararao)కూడా మాట్లాడుతు మమ్మల్ని నలభై ఏళ్లుగా ఆదరిస్తూ వస్తున్నారు.అదే విదంగా మా మనవడిని ఆశీర్వదించి సినిమాకి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

చిన్నరెడ్డయ్య, పాండురంగారావు లు కలిసి నిర్మిస్తున్న ఈ మిస్టర్ సెలబ్రిటీకి  రవికిషోర్ దర్శకత్వాన్ని వహిస్తుండగా  వరలక్ష్మి శరత్ కుమార్, నాజర్, రఘుబాబు కీలక పాత్రల్లో చేస్తున్నారు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com