![]() |
![]() |
పవన్‌కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మూడు వరస హిట్స్ అందుకొని హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత చేసిన సినిమా తమ్ముడు. ఈ సినిమా ఘనవిజయంతో స్టార్ హీరో రేంజ్‌కి వెళ్లిపోయారు. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ సరసన నటించిన ప్రీతి జంగ్యానీ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 2008లో 2008లో నటుడు, దర్శకుడు, మోడల్ పర్వీన్ దబాస్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పర్వీన్ దబాస్ అనేక హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. శనివారం తెల్లవారు జామున ముంబాయిలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. పర్వీన్ స్వయంగా కారును డ్రైవ్ చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడడంతో బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. ఐసీయులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రీతి జంగ్యానీ భర్తతోపాటే ఆస్పత్రిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. దీని గురించి కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
దీనిపై ప్రీతి జంగ్యానీ మాట్లాడుతూ ‘నేను, నా కుటుంబం షాక్‌లో ఉన్నాం. ఏమీ మాట్లాడలేని స్థితిలో నేను ఉన్నాను. తెల్లవారు జామున నా భర్త ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన కండిషన్ క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు’ అని వివరించారు. ప్రీతి తొలిసారి తెలుగులో నటించిన తమ్ముడు చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆ తర్వాత నరసింహనాయుడు, అధిపతి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, యమదొంగ, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటి సినిమాల్లో నటించారు. బాలీవుడ్ సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్న ప్రీతి చివరిగా 2017లో వచ్చిన ఓ రాజస్తానీ మూవీలో నటించారు. గత ఏడాది కఫస్ అనే వెబ్ సిరీస్ చేశారు.
![]() |
![]() |