![]() |
![]() |
.webp)
మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకి ముందు యాంకర్ శ్యామల(anchor syamala)ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(pawan kalyan)ని అనరాని మాటలతో తూలింది. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్లేట్ మార్చి నేనెలా అనలేదని, ఎవర్ని పర్సనల్ గా తిట్టే అలవాటు లేదని చెప్పుకొచ్చింది.పైగా చంద్రబాబు, పవన్ అభిమానుల నుంచి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పడంతో యాంకర్ శ్యామల ఇక రాజకీయాల గురించి మాట్లాడదని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెకి ఒక కీలక పదవి వరించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా శ్యామల కి ఒక కీలక పదవిని కట్టబెట్టింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో ఇక నుంచి శ్యామల వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో ఉండనున్నారు.భూమన కరుణాకర రెడ్డి, రోజా, జూపూడి ప్రభాకర్ రావు లు కూడా శ్యామల తో పాటు అధికార ప్రతినిధిలుగా పని చేయనున్నారు.

ఇక ఈ వార్తతో సినీ అండ్ పొలిటికల్ సర్కిల్స్ లో తాజాగా ఒక చర్చ జరుగుతుంది. వైసీపీ లో కీలక పదవులు ఇచ్చేదే వ్యక్తిగతంగా చంద్రబాబు, పవన్ లని తిట్టడానికి. పైగా అలా తిడితేనే పదవి ఉంటుందన్న విషయం కూడా అందరకి తెలుసు. మరి శ్యామల ఇప్పుడు ఆ ఇద్దర్ని తిడుతుందా లేదా అని టిడిపీ, జనసేన క్యాడర్ చర్చించుకుంటుంది. అదే విధంగా ఎలా స్పందిస్తారో కూడా చూడాలి.
![]() |
![]() |