![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ(balakrishna)కళారంగ ప్రవేశం చేసి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో బాలయ్య అర్ధ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇక మరో తాజా న్యూస్ తో ఇప్పుడు ఆ హ్యాపీనెస్ డబుల్ అయ్యిందని చెప్పవచ్చు.
బాలకృష తనయుడు మోక్షజ్ఞ(mokshagna)సినీ ఎంట్రీ ఖాయమైన విషయం అందరకి తెలిసిందే. హనుమాన్(hanuman)ఫేమ్ ప్రశాంత్ వర్మ(prashanth varma)దర్శకుడు. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య ప్రకటించినప్పటి నుంచే ఏ జోనర్ లో మూవీ తెరకెక్కబోతుందనే అనే ఆసక్తి నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది. ఈ క్రమంలోనే మైథలాజికల్ జోనర్ అనే టాక్ వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ కోసం నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తిష్ట వేస్తున్నారు. ఇక గతంలోనే బాలయ్య కూడా ఒక రోల్ లో కనిపించబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అధికారకంగా మాత్రం ధ్రువీకరించలేదు. కాకపోతే ఇప్పుడు బాలయ్య నటించడం నిజమని, పైగా బాలయ్య శ్రీ కృష్ణుడు గా మెరవబోతున్నాడనే వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

దీంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ వార్త నిజమవ్వాలనికోరుకుంటూ గతంలో బాలయ్య కృష్ణుడుగా కనిపించిన సినిమాలని మరో సారి మననం చేసుకుంటున్నారు.మంగమ్మగారి మనవడు, శ్రీ కృష్ణార్జున విజయం, పాండురంగడు వంటి వాటిల్లో కృష్ణుడుగా చేసి అభిమానులని మెప్పించాడు.ఇక సెప్టెంబర్ 6 న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మూవీని గ్రాండ్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టైటిల్ విషయంలో కూడా నందమూరి అభిమానుల్లో ఆసక్తి ఉంది.
![]() |
![]() |