![]() |
![]() |
సూపర్‌స్టార్ మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజు ఆగస్ట్ 31. ఈ సందర్భంగా తండ్రి మహేష్, తల్లి నమ్రత.. కుమారుడు గౌతమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 18వ ఏట అడుగుపెడుతున్న కొడుకుని సోషల్ మీడియా ద్వారా విష్ చేశారు. ‘హ్యాపీ 18 సన్.. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. తండ్రిగా నేను గర్విస్తున్నాను’ అంటూ పోస్ట్ చేశారు మహేష్.
మరో పోస్ట్‌లో నమ్రత మరో ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోను న్యూయార్క్ యూనివర్సిటీలో తీసినట్లుగా తెలుస్తోంది. ఫ్రేమ్‌లో, యువకుడు ఒక బ్యాగ్‌ని పట్టుకుని కెమెరా వైపు చిరునవ్వుతో మెరిశాడు. ‘కొత్త ప్రారంభానికి! పుట్టినరోజు శుభాకాంక్షలు. తల్లిదండ్రులుగా ఇది మాకు పెద్ద పండగలాంటిది’ అంటూ పోస్ట్ చేశారు నమ్రత.
![]() |
![]() |