![]() |
![]() |
.webp)
దర్శకధీరుడు రాజమౌళి(rajamouli)ప్రస్తుతం మహేష్ బాబు(mahesh babu)తో తెరకెక్కించబోయే నూతన సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. మహేష్ కెరీర్ తో పాటు తన కెరీర్ లో కూడా ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల కంటే నెంబర్ వన్ గా నిలిచేలా చెయ్యడానికి ప్రతి విషయంలోను పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే మూవీ ఓపెనింగ్ లేట్ అవుతు వస్తుంది. ఈ క్రమంలో రాజమౌళి మీద చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
ఆస్కార్ విన్నర్ కీరవాణి తనయుడు శ్రీ సింహా(Simha Koduri)హీరోగా తెరకెక్కిన మత్తువదలరా 2(mathu vadalara 2)ఈ నెల 13 న విడుదల కాబోతుంది. 2019 లో వచ్చిన మత్తు వదలరా కి సీక్వెల్ కాగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah)హీరోయిన్. రీసెంట్ గా చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చెయ్యగా ప్రేక్షకుల నుంచే కాకుండా, సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే రాజమౌళి ఒక ట్వీట్ చేసాడు. టీజర్ నాకెంతో నచ్చింది. డైలాగ్స్, విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయంటూ సదరు ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. దీంతో చిత్ర యూనిట్ జక్కన్న ట్వీట్ కి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. మీకు మా టీజర్ నచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది.సెప్టెంబర్ 13 న ఖచ్చితంగా మీ హృదయాన్ని తస్కరిస్తాం అని ట్వీట్ చేసింది.

అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers)నిర్మిస్తుండగా రితీష్ రానా(ritesh rana)దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. ఇక ఈ మూవీకి ఉన్న స్పెషల్ ఏంటంటే హీరోయిన్ ఫరియా ఒక సాంగ్ రాయడంతో పాటుగా ఆ సాంగ్ ని పాడి, కొరియోగ్రఫీ కూడా చేసింది.కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడు.
![]() |
![]() |