![]() |
![]() |
స్టార్ అయినా, సూపర్‌స్టార్ అయినా బిజినెస్ విషయానికి వచ్చేసరికి అందరూ సమానమే. టాప్ హీరో స్థానంలో ఉన్నా అతని సినిమాకు బిజినెస్ జరగడం కొన్ని సందర్భాల్లో కష్టతరమైపోతుంది. అలాంటి దుస్థితి సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న రజినీకాంత్ నటించిన ‘లాల్‌సలామ్’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో రజినీది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు. కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఆ క్యారెక్టర్ చేసేందుకు రజినీ ఒప్పుకున్నారు. తండ్రి స్టార్ ఇమేజ్ తన సినిమాకి కూడా ఉపయోగపడుతుందని ఐశ్వర్య ఆ ప్లాన్ వేసింది. ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటించారు. ఈ సినిమాకి సంబంధించిన పబ్లిసిటీ రజినీ స్టిల్స్‌తోనే ఎక్కువగా చేశారు. దానికి తగ్గట్టుగానే బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే ప్రేక్షకులు ఈ సినిమాని తిప్పికొట్టారు. రజినీకాంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది ‘లాల్ సలామ్’.
దీనిపై వివరణ ఇచ్చిన ఐశ్వర్య రజినీకాంత్.. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించిన ఫుటేజ్ మిస్ అయిందని, అందుకే సినిమా అనుకున్న స్థాయిలో రాలేదని చెప్పుకొచ్చారు. అందులో వాస్తవం ఎంత ఉందో తెలీదు గానీ సినిమాకి మాత్రం ఆశించిన ఫలితం దక్కలేదు. థియేట్రికల్‌గా సక్సెస్ కాకపోయినా ఓటీటీలో అయినా సినిమాకి ఆదరణ లభిస్తుందని అనుకున్నారు. అయితే ఈ సినిమాను స్ట్రీమ్ చేసేందుకు ఓటీటీ సంస్థలు ముందుకు రాలేదు. గత ఏడాది బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘జైలర్’ తర్వాత వచ్చిన సినిమా అయినప్పటికీ ఏ సంస్థా ఈ సినిమాపై ఆసక్తి చూపించలేదు.
ఫైనల్‌గా ‘లాల్ సలామ్’ చిత్రం సెప్టెంబర్ 20 నుంచి సన్ నెక్స్‌ట్‌లో స్ట్రీమింగ్ కానుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ దర్శనమిచ్చింది. ఆ పోస్టర్‌ని అందరూ సర్క్యులేట్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ కాబోతోందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. ఎందుకంటే ఆ పోస్టర్ ఫేక్ అని తేలింది. దాన్ని లైకా ప్రొడక్షన్స్‌గానీ, సన్ నెక్స్‌ట్‌గానీ రిలీజ్ చెయ్యలేదట. ఇది ఫ్యాన్స్ చేసిన పని అని తేలింది. కావాలనే రజినీ ఫ్యాన్స్ అలా చేశారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే లాల్ సలామ్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు పక్కన పెట్టాయని అర్థమవుతోంది. ఈ ఫేక్ రిలీజ్ డేట్ అందర్నీ డిజప్పాయింట్ చేసింది. అయితే రజినీ లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’పై సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. అక్టోబర్ 10న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కాబోతోంది. ఖచ్చితంగా ఇది తలైవాకి భారీ హిట్ ఇస్తుందని రజినీ అభిమానులు కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు.
![]() |
![]() |