![]() |
![]() |
.webp)
నాచురల్ స్టార్ నాని(nani)ఒక వైపు.. ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ బరిలో దిగి ప్రతి పక్ష హోదాని కూడా కోల్పోయిన వై సి పీ ఒక వైపు. అసలు ఇక పార్టీనే క్లోజ్ అయినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు నాని మీద కోపాన్ని తీర్చుకోవాలనే ప్లాన్ లో వైసిపీ కి చెందిన కొంత మంది ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయం ఏంటో చూద్దాం.
నాని సరిపోదా శనివారం(saripoda sanivaram)ఈ నెల 29 న వరల్డ్ వైడ్ గా ల్యాండింగ్ కి సిద్ధం అవుతుంది. హాయ్ నాన్న(hi nanna)లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక చర్చ జరుగుతుంది. సరిపోదా శనివారం మూవీ బాగున్నా కూడా కొంత మంది వైసిపీ అభిమానులు నెగిటివ్ టాక్ తెచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని కొంత మంది సినీ పండితులు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆ మాటలతో ఏకీభవిస్తున్నారు కూడా. ఎందుకంటే వైసిపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేసే ఆగడాలని నాని ఎండగట్టాడు. పైగా పవన్ కళ్యాణ్ కి ఫుల్ సపోర్ట్ గా నిలిచాడు. పవన్ పిఠాపురం నుంచి గెలవాలని ట్వీట్ కూడా చేసాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రమోషన్స్ లో కూడా పవన్ పేరు ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే సరిపోదా శనివారం కి వైసిపి బ్యాచ్ నెగిటివ్ టాక్ తెచ్చే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి.

ఇక వైసిపీ ని సమర్ధవంతగా ఎదుర్కొంటామని చెప్తు సినీ మార్కెట్ లో సరిపోదా శనివారం హడావిడిని ఫ్యాన్స్ స్టార్ట్ చేసారు. ఇందుకు నిదర్శనంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ దగ్గర మునుపెన్నడూ లేని విధంగా నాని భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు. ప్రియాంక మోహన్(priyanka mohan)హీరోయిన్ కాగా ఎస్ జె సూర్య(s.j surya)సాయి కుమార్(sai kumar)ప్రధాన పాత్రలో చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ దానయ్య(danayya)నిర్మాత కాగా వివేక్ ఆత్రేయ(vivek athreya)దర్శకుడు.
![]() |
![]() |