![]() |
![]() |

మంచు ఫ్యామిలీ నుంచి మూడో తరం వస్తోంది. మంచు మోహన్ బాబు (Mohan Babu) వారసులుగా కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మి సినీ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు మూడో తరం కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మంచు విష్ణు (Manchu Vishnu ) తనయుడు అవ్రామ్ భక్త మంచు 'కన్నప్ప' సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న 'కన్నప్ప' (Kannappa)లో 'తిన్నడు' పాత్రలో అవ్రామ్ నటిస్తున్నాడు. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా 'కన్నప్ప' నుంచి అవ్రామ్ లుక్ ని రివీల్ చేస్తూ రెండు పోస్టర్లను వదిలారు. ఆ పోస్టర్లలో అవ్రామ్ లుక్ బాగుంది. బాల నటుడిగా తన మార్క్ చూపిస్తాడని పోస్టర్లతోనే అర్థమవుతోంది.

శివ భక్తుడైన కన్నప్ప అసలు పేరు తిన్నడు అని తెలిసిందే. తిన్నడే తన అపారమైన భక్తితో భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తాజా పోస్టర్స్ ని బట్టి చూస్తే.. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్పలో.. చైల్డ్ ఎపిసోడ్స్ లో తిన్నడుగా అవ్రామ్ కనిపించనున్నాడని తెలుస్తోంది.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న కన్నప్పలో పలువురు బిగ్ స్టార్లు నటిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ఆర్.శరత్‌కుమార్ ఇలా ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు భారీ బడ్జెట్ నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |