![]() |
![]() |
.webp)
కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ అక్కర్లేదనే డైలాగ్ ని ఇప్పుడు కాస్త అటు ఇటుగా మార్చి కంటెంట్ ఉన్న సినిమాలకి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. రికార్డు కలెక్షన్స్ వస్తాయని చెప్పుకునే పరిస్థితి. ఇందుకు ఉదాహరణగా మొన్న అగస్ట్ 15 న వచ్చిన స్త్రీ 2 ఎలాంటి స్టార్ కాస్ట్ లేకపోయినా ఇప్పటికే దగ్గర దగ్గర గా 600 కోట్ల గ్రాస్ లో ల్యాండ్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ట్రేడ్ సర్కిల్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ని ఉద్దేశించి ఒక చర్చ జరుగుతుంది.
పుష్ప 2(pushpa 2)కి పాజిటివ్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కలెక్ట్ చెయ్యడం పక్కా అని సినీ ట్రేడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.పుష్ప పార్ట్ 1 హిట్ తో అన్ని లాంగ్వేజెస్ వారు పుష్ప 2 కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, దీంతో కంటెంట్ బాగుంటే వెయ్యి కోట్లు సాధించడం పెద్ద విశేషం కాదని చెప్తున్నారు. వాళ్ళ అంచనాలు నిజం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ తో పాటు సాంగ్స్ కూడా పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పైగా యానిమల్ తో రష్మిక క్రేజ్ కూడా పీక్ లో ఉంది.
.webp)
ఇక ఈ వార్తలతో అల్లు అర్జున్ (allu arjun)ఆర్మీ ని ఎవరు ఆపలేని పరిస్థితి నెలకొని ఉంది.మా బన్నీ రేంజ్ ఇది అంటూ వెయ్యి కోట్ల న్యూస్ ని ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు. అసలు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి ఉంటే డైలీ పుష్ప 2 సృష్టించిన రికార్డు గురించి మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళం. కానీ ఏం చేస్తాం డిసెంబర్ 6 కి వాయిదా పడింది. మైత్రి మూవీ మేకర్స్ (mytri movie makers)సుకుమార్(sukumar) కూడా వెయ్యి కోట్ల న్యూస్ ని నిజం చేసే పనిలోనే ఫుల్ బిజీగా ఉన్నారు.
![]() |
![]() |