![]() |
![]() |

యువ సామ్రాట్ నాగార్జున(nagarjuna)కి చెందిన హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ ని తెలంగాణ ప్రభుత్వం కూల్చి వేసిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. నాగార్జున కోర్టు కి వెళ్లి స్టే తెచ్చుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆ లోపే అధికారులు కూల్చి వేశారు. ఈ క్రమంలో తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)నాగార్జున కి ఉన్న అనుబంధం అందరకి తెలిసిందే. పైగా చిరు ని తన అన్నయ్య గా నాగ్ భావిస్తాడు. ఈ విషయాన్నీ చాలా సందర్భాల్లో స్వయంగా నాగ్ నే చెప్పాడు. అలాగే రెండు కుటుంబాల మధ్య కూడా మంచి రిలేషన్ ఉంది. తమ తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు కూడా ఇరువైపులా నుంచి అందరు తప్పనిసరిగా హాజరవుతుంటారు. దీంతో ఇప్పుడు చిరు ని ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కలుస్తాడనే ప్రచారం జోరుగానే జరుగుతుంది. చిరు తో మాట్లాడిన తర్వాతే నాగ్ తదుపరి రియాక్షన్ ఉంటుందని కూడా అంటున్నారు.
ఇక చిరంజీవి ఇటీవలే తన 69 వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు. నాగ్ ఎక్స్ వేదికగా చిరు కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా నాకు ఇన్స్పిరేషన్ కూడా చిరు నే అని ట్వీట్ చేసాడు.
![]() |
![]() |