![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)తను సాధించాలనుకున్న రాజకీయ కార్యాన్ని అయితే సాధించాడు. ఇక ఇప్పుడు సినీ కార్యమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ వరుస పెట్టి పవన్ ని కలుస్తున్నారు.ప్రజల మీద చూపించే ప్రేమ అభిమానాలు మా మీద కూడా చూపించే సమయం ఆసన్నమైందని గుర్తు చేస్తున్నారు.
పవన్ చేతిలో ఓజి(og)ఉస్తాద్ భగత్ సింగ్(ustaad bhagat sing)హరిహర వీరమల్లు(hari hara veera mallu)వంటి భారీ బడ్జట్ మూవీస్ ఉన్నాయనే విషయం అందరకి తెలిసిందే. పైగా ఆ మూడు కూడా కొంత భాగం షూటింగ్ జరుపుకున్నవే. ఓజి అయితే కాస్త ఎక్కువగానే కంప్లీట్ చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే పవన్ ని రీసెంట్ గా ఓజి నిర్మాత దానయ్య దర్శకుడు సుజిత్ తో కలిసి మీట్ అయ్యాడు. ఆ చర్చల్లో అక్టోబర్ నుంచి ఓజి షూటింగ్ లో జాయిన్ అవుతానని భరోసా ని పవన్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి పవన్ ని ఇప్పుడు కలవటానికి కంటే ముందే ఒకసారి దానయ్య కలిసాడు. అలాంటిది మళ్ళీ వెంటనే కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో ఉస్తాద్, వీరమల్లు లకి కూడా ఓజి డేట్స్ లోనే ఏమైనా సర్దుబాటు చేసి డేట్స్ ఇస్తాడేమో అనే చర్చ సినీ సర్కిల్స్ లో నడుస్తుంది. ఇందుకు బలం చేకూరేలా ఉస్తాద్ అధినేతలైన మైత్రి మూవీ మేకర్స్ యలమంచిలి రవి శంకర్, నవీన్ ఎర్నేని లు పవన్ ని ఇటీవలే కలిశారు. పైగా ఈ భేటీలో పవన్ డేట్స్ గురించే ప్రధానంగా చర్చలు జరిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇక సూర్య మూవీస్ అధినేత ఏఎం రత్నం కూడా పవన్ ని కలవబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
.webp)
పైగా పవన్ కి అత్యంత సన్నిహితుడు కూడా. నిజానికి ఓజి , ఉస్తాద్ ల కంటే ముందే వీరమల్లు సార్ట్ అయ్యింది. అసలు కొన్ని రోజుల క్రితం అయితే వీరమల్లు నే మిగతా వారి కంటే ముందు రిలీజ్ అవుతుందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఓజి రాబోతుందనే చర్చ నడుస్తుంది.కాకపోతే సెప్టెంబర్ 27 నుంచి వాయిదా పడింది. ఇక పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2 వ తేదీన ఆ మూడు చిత్రాల అప్ డేట్స్ ఏమైనా ప్రకటించాలనే చర్చ కూడా పవన్ తో నిర్మాతలు చర్చలు కూడా జరుపుతున్నారు. ఏది ఏమైనా పవన్ సినిమాల కోసం అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఫుల్ వెయిటింగ్.
![]() |
![]() |