Home

»

Latest News

బ్లాక్ బస్టర్ ‘‘రాయన్ ’’ఇక ఓటిటి లో చూసేయండి..ఎక్కడ చూడొచ్చంటే

Aug 23, 2024 12:08PM


తమిళ  అగ్రహీరోల్లో ఒకడైన ధనుష్(dhanush)నుంచి గత నెల జులై 26 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రాయన్(raayan)పాన్ ఇండియా లెవల్లో విడుదలవ్వగా అన్ని చోట్ల  మంచి విజయాన్నే  అందుకుంది. సన్ పిక్చర్స్ పై కళానిది మారన్ నిర్మించగా ధనుషే రచనా దర్శకత్వం అందించాడు. పైగా స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ లైబ్రరీ లో కూడా చోటు సంపాదించింది. దీన్ని బట్టి రాయన్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రేంజ్ సరికొత్త రూపాన్ని సంపాదించుకుంది.


ప్రముఖ ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో రాయన్ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అగస్ట్ 23  అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ మేరకు అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది  దీంతో ఓటిటి సినీ ప్రేమికుల్లో పండుగ వాతావరణంరావడంతో పాటుగా ఎప్పుడెప్పుడు మూవీని చూస్తామా అనే క్యూరియాసిటీ కూడా  ఉంది. ఇక రాయన్  ధనుష్ కెరీర్ లో 50 వ సినిమాగా వచ్చింది.

 

ఫ్యామిలీ అండ్ రివెంజ్ డ్రామా గా వచ్చిన రాయన్ లో ,  ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం లు అన్నదమ్ములుగా చెయ్యగా చెల్లెలిగా  దుషారా విజయన్ చేసింది. ఈ నలుగురి పెర్ఫార్మెన్సు  మూవీకి హైలెట్ గా నిలిచింది. అలాగే ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య, వరలక్ష్మి శరత్ కుమార్  లు పవర్ ఫుల్ పాత్రల్లో మెరిశారు.మూవీలో ఎన్నో ట్విస్టులు కూడా ఉన్నాయి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com