![]() |
![]() |

సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకునే అదృష్టం కలగాలంటే పెట్టి పుట్టాలని అంటారు. అలా పెట్టి పుట్టిన వాళ్ళల్లో బలగం(balagam)మూవీ డైరెక్టర్ వేణు కూడా ఒకడు. కామెడీ నటుడుగా ఎంట్రీ ఇచ్చి బలగం ఘన విజయంతో బలగం వేణు(balagama venu)గా మారాడు. ఇప్పుడు ఆయన ఒక బంపర్ ఆఫర్ ని అందుకున్నాడు.
నాచురల్ స్టార్ నాని(nani)నయా మూవీ సరిపోదా శనివారం(saripoda sanivaram)అగస్ట్ 29 రిలీజ్ డేట్ కావడంతో వరుస పెట్టి ప్రమోషన్స్ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతు బలగం వేణు డైరెక్షన్ లో సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు.దీంతో చాలా రోజుల నుంచి బలగం వేణు డైరెక్షన్ లో నాని సినిమా చేస్తాడా లేదా అని వస్తున్న చర్చలకి చెక్ పడినట్టయ్యింది.ఇక నాని లాంటి స్టార్ తో అవకాశం రావడం వేణు అదృష్టమనే చెప్పాలి. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుండటంతో ఆ ఇద్దరి కాంబో సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుందో అనే క్యూరియాసిటీ అయితే అందరిలో మొదలయ్యింది.
![]() |
![]() |