![]() |
![]() |
.webp)
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అక్కినేని నాగార్జున(akkineni nagarjuna)అభిమానులు, బుల్లి తెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 (bigg boss season 8)కి రంగం సిద్ధం కానుంది. సెప్టెంబర్ 1 న ప్రారంభం అయ్యి వంద రోజుల పాటు కంటెస్ట్ లతో పాటు ప్రేక్షకులని కూడా బిగ్ బాస్ మెస్మరైజ్ చెయ్యనుంది.దీంతో ఈ సారి హౌస్ లో ఎవరు ఉండబోతున్నారనే క్యూరియాసిటీ కూడా అందరిలో మొదలయ్యింది.ఇప్పటికే సోషల్ మీడియాలో రక రకాల పేర్లు వినిపిస్తున్నాయి. వాటిల్లోని ఒక పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వేణు స్వామి. ఒకప్పుడు ప్రముఖ జ్యోతిష్యుడు. ఒకప్పుడు అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, కొన్ని రోజుల నుంచి మోస్ట్ పవర్ ఫుల్ వివాదాస్పద జ్యోతిష్యుడు గా పేరు ని సంపాదించాడు. ఆల్రెడీ ఏ ఛానల్ లో చూసిన వేణు స్వామి పేరే వినపడతుంది. కొంత మంది అయితే స్వామి అని అనకండి అలాగే ఆయన జ్యోతిష్యుడు కాదని కూడా అంటున్నారు.ఇక అసలు మ్యాటర్ కి వస్తే కొన్ని రోజుల క్రితం వరకు వేణు స్వామి కూడా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలు వినిపించాయి. హౌస్ అధికారకంగా ప్రకటించపోయినా వేణు స్వామి హౌస్ లో పాల్గొనడం పక్కా అని అందరు అనుకున్నారు. ఎందుకంటే వివాదాస్పద వ్యక్తులకి కూడా హౌస్ లో పాల్గొనే అవకాశాన్ని యాజమాన్యం కలిపిస్తుంది.కానీ ఎప్పుడైతే నాగ చైతన్య(naga chaitanya)శోభిత(sobhita)లు విడాకులు తీసుకుంటారని చెప్పాడో, ఆ నిమిషమే లిస్టు నుంచి వేణు స్వామి పేరు తొలగించారనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే హోస్ట్ గా ఎవరెస్టు శిఖరం లాంటి నాగార్జున ఉండటంతో, ఆయనకి కోపం తెప్పించకూడదనే ఉద్దేశంతోనే నిర్వాహకులు ఆ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కాబోయే కోడలిపైనే వివాదాస్పద కామెంట్స్ చేయడంతో నాగ్ చాలా కోపం గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక వేణు స్వామి తొలగింపు వార్తలని చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఐతే ఖుషీగా ఉన్నారు.
ఇక ఈ సారి కూడా బిగ్ బాస్ హౌస్ క్రేజీ కంటెస్ట్ ల తో కళకళలాడబోతుంది.కిర్రాక్ ఆర్పీ(kiraak rp)అభినవ్ గోమఠం, వింధ్య విశాఖ, నయని పావని, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, కుషితా కల్లపు, కుమారీ ఆంటీ, బర్రెలక్క, సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ, సురేఖ వాణి తో పాటు ఆమె కూతురు సుప్రిత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలియాలంటే బిగ్ బాస్ లాంఛింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కాకపోతే వేణు స్వామి మాత్రం మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. అందుకే అంటారు టంగో రక్షతి రక్షితః అని.
![]() |
![]() |