![]() |
![]() |

సినిమాలో తాను పోషించే పాత్రకు తగ్గట్టుగా బాడీని మలచుకునే అతికొద్ది మంది హీరోలలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకరు. గత చిత్రం 'స్కంద' కోసం 86 కిలోల బరువుతో సాలిడ్ గా కనిపించిన రామ్.. తన తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' కోసం ఏకంగా 18 కిలోలు తగ్గి, 68 కిలోల బరువుతో ఫిట్ గా మారాడు. (Double iSmart)
'డబుల్ ఇస్మార్ట్' కోసం రెండు నెలల్లోనే ఏకంగా 18 కిలోల బరువు తగ్గినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రామ్. అంతేకాదు తాజాగా సోషల్ మీడియా వేదికగా బరువు తగ్గడం కోసం తాను ఎంత కష్టపడ్డాడో ఫొటోల ద్వారా ఆ ప్రయాణాన్ని పంచుకున్నాడు. జిమ్ లో కసరత్తులు చేస్తూ, మంచి ఆహరం తీసుకొని, న్యాచురల్ తన బాడీని పాత్రకి తగ్గట్టుగా మలిచినట్టు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ డెడికేషన్ పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.

రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా వస్తున్న చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం మంచి అంచనాలతో ఆగష్టు 15న థియేటర్లలో అడుగు పెడుతోంది.
![]() |
![]() |