![]() |
![]() |

అక్షరాల్లో ఎప్పటికప్పుడు మార్పు రాకపోతే చదివే వాడికి ఎలా అయితే కిక్ ఉండదో, సినిమా వార్తల్లో కూడా ఎప్పుడు ఒకే రకమైనవి వస్తే కిక్ ఏముంటుంది. అందుకే ఒక సరికొత్త వార్త ఇప్పుడు సినీ ప్రియులకి కిక్ ని ఇస్తుంది. పైగా అది బాలయ్య(balakrishna)సినిమా అయితే డబుల్ కిక్.
బాలయ్య తన అప్ కమింగ్ మూవీని హిట్ చిత్రాల దర్శకుడు బాబీ(bobby)దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరకి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ లోను,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది. విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(bobby deol)నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగిసినట్లుగా దర్శకుడు బాబీ ప్రకటించాడు.ఈ మేరకు బాబీ డియోల్‌తో కలిసి ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

ఈ విధంగా ఒక దర్శకుడు తన నటుడి పాత్ర ముగిసిందని ప్రకటించడం ఒక కొత్త న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈ ప్రెస్టేజియస్ట్ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా వాల్తేరు వీరయ్యలో చిరంజీవి(chiranjeevi)ని వేర్ ఈజ్ ది పార్టీ అని అడిగిన ఊర్వశి రౌతాల వన్ అఫ్ ది మెయిన్ రోల్ లో చేస్తుంది.
![]() |
![]() |