![]() |
![]() |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలతో అలరించాడు. అక్టోబర్ 31న 'మెకానిక్ రాకీ'తో పలకరించనున్నాడు. అలాగే రామ్ నారాయణ్ దర్శకత్వంలో 'లైలా', శ్రీధర్ గంటా దర్శకత్వంలో 'VS13' (వర్కింగ్ టైటిల్) చేస్తున్నాడు. ఇక తాజాగా మరో సినిమాని ప్రకటించాడు.
'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ డైరెక్షన్ లో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విశ్వక్ సేన్ కెరీర్ లో 14వ సినిమాగా రానున్న ఈ మూవీ 'VS14' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, థియేటర్లలో నాన్-స్టాప్ నవ్వులు ఉంటాయని మేకర్స్ తెలిపారు.
విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్ ని క్రేజీ కాంబో అని చెప్పవచ్చు. అనుదీప్ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక విశ్వక్ కి మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో తన కామెడీ టైమింగ్ చూపించాడు. మరి ఈ ఇద్దరి కలిసి ఏ రేంజ్ లో నవ్వులు పంచుతారో చూడాలి.
![]() |
![]() |