![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా సెకండ్ సింగిల్ గా "చుట్టమల్లే" సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూట్యూబ్ లో రికాండ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీల కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా జాన్వీ గ్లామర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కి మరో సర్ ప్రైజ్ ఇచ్చింది జాన్వీ.
"చుట్టమల్లే" సాంగ్ మేకింగ్ వీడియోని తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది జాన్వీ. బ్యాక్ గ్రౌండ్ "చుట్టమల్లే" సాంగ్ ప్లే అవుతున్న ఈ వీడియో.. అందాల విందులా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Devara Second Single)
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |