![]() |
![]() |
ఇటీవల వాయనాడ్ ప్రాంతంలో వచ్చిన వరద ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీనిపై చిత్ర పరిశ్రమ స్పందిస్తోంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ భారీగా విరాళాలు చేరుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సూర్య, జ్యోతిక, రష్మిక, నయనతార వంటి తారలు తమ విరాళాలను ప్రకటించారు. అయితే ఈ విరాళాలు ప్రకటించడంలో కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై చర్చ నడుస్తోంది.
అల్లు అర్జున్ సినిమాలకు కేరళలో ఎంతటి ఆదరణ ఉంటుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌కి చెందిన ఏ హీరోకీ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడ బన్నికి ఉంది. ఇక చిరంజీవి, రామ్‌చరణ్ సినిమాలకు కేరళలో ఆదరణ అంతంత మాత్రమే. వాయనాడ్ బాధితులకు విరాళాలు ప్రకటించిన తర్వాత యాంటీ బన్నీ ఫ్యాన్స్‌కి అతన్ని విమర్శించేందుకు ఒక అవకాశం దొరికనట్టయింది. దీనిపై కొందరు స్పందిస్తూ ‘చిరంజీవి, రామ్‌చరణ్ సినిమాలు అక్కడ అంతగా ఆడకపోయినా, అక్కడ వారికి అంత ఫాలోయింగ్ లేకపోయినా వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించారు. నీ సినిమాలు అక్కడ విపరీతంగా ఆడతాయి. అయినా నువ్వు 25 లక్షలు మాత్రమే ఇచ్చావు’ అంటూ కామెంట్ చెయ్యడం మొదలు పెట్టారు.
పనిలో పనిగా మంగళవారం జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో సుమను కూడా టార్గెట్ చేశారు. ‘నువ్వు కేరళ నుంచి ఇక్కడికి వచ్చావు. అక్కడ బీభత్సం జరిగిపోయి ప్రజలు కష్టాల్లో ఉంటే ఇక్కడ నువ్వు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నావా. నీ తరఫున వారికి సాయం చెయ్యొచ్చు కదా’ అని ప్రశ్నించారు. ఇది చూసిన వారికి కూడా నిజమే కదా.. ఆమె సొంత రాష్ట్రం కేరళ. కాబట్టి తప్పకుండా సహాయం చెయ్యాలి అంటూ ఆ కామెంట్ చేసిన వారిని సపోర్ట్ చేశారు. అయితే సుమ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఆల్రెడీ సుమ కేరళ సీఎం ఫండ్‌కి 2 కోట్ల రూపాయల విరాళం అందించిందట. మరో విషయం ఏమిటంటే.. ఇలాంటి సహాయాలు సుమ ఎన్నో చేసిందనీ, అయినా ఎప్పుడూ చెప్పుకోదని అంటున్నారు. అధికారికంగా సుమ ఈ విషయాన్ని ప్రకటించకపోయినా ఇదే నిజమని విశ్వసనీయ సమాచారం.
![]() |
![]() |