![]() |
![]() |

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2' (Indian 2). 'భారతీయుడు'కి సీక్వెల్ గా రూపొంది, భారీ అంచనాలతో జులై 12న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలోనూ కొంత సస్పెన్స్ ఏర్పడింది. అయితే ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కి తెరపడింది.
'భారతీయుడు 2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 9న నుంచి ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ నిర్మించిన 'భారతీయుడు 2' చిత్రంలో సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహ, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరించారు.
![]() |
![]() |