![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సెలబ్రిటీ నూతన్ నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాన్నాళ్లకు ఇప్పుడు మళ్ళీ అతను వెలుగులోకి వచ్చాడు. ఈరోజు అయన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేతృత్వంలో నూతన్ నాయుడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దీంతో షర్మిల నూతన్ నాయుడికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా నూతన్ నాయుడు ఫేమస్ అయ్యారు. ఆ బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన ఫేమ్ తో ఆయన పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. నూతన్ నాయుడు గతంలో ప్రజారాజ్యంలోనూ పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. బిగ్ బాస్ తర్వాత తన ఇంట్లో పనిచేసే దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఒక వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.
దాంతో అతనిపై కేసు నమోదవడంతో కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత నూతన నాయుడు టాపిక్ ఎక్కడా వినిపించడమే మానేసింది. ఇక ఇప్పుడు సడెన్ గా తెరమీదకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం సెన్సేషన్ గా మారింది. ఇక కాంగ్రెస్ కూడా మళ్ళీ రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచి ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళను పార్టీలోకి తీసుకుని వాళ్ళ సేవల్ని వినియోగించడానికి రెడీ అయ్యింది.
![]() |
![]() |