![]() |
![]() |
.webp)
కేరళ లోని వయనాడ్ లో ఇటీవల భారీ వర్షాలకి కొండచరియలు విరిగిపడి వందల మంది మృత్యు వాత పడిన విషయం తెలిసిందే. మరణాల సంఖ్య రోజు రోజు కి పెరుగుతుండంతో అందరిలోను ఆందోళన కూడా మొదలవుతు ఉంది. అదే విధంగా వందల మంది నిరాశ్రయులుగా మిగులుతున్నారు.దీంతో బాధితుల్ని ఆదుకోవడానికి ప్రాంతాలకి,పార్టీలకి అతీతంగా ఎంతో మంది రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు,మేధావులు తమకి తోచిన సాయం చేస్తున్నారు. ఈ వరుసలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా(rashmika mandanna)కూడా చేరింది.
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి రష్మిక 10 లక్షల రూపాయలని ప్రకటించింది. జరిగిన విషాధం పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తు ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని విజ్నప్తి చేసింది. ఇక ఈ సంఘటనతో రష్మిక మనసు ఎలాంటిదో మరోసారి రుజవయ్యింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో తన చేతనైనంత సాయం చేసి చాలా మందికి ఆదర్శంగా నిలిచింది. 2016 లో కన్నడంలో తెరకెక్కిన కిరాక్ పార్టీ తో తెరంగ్రేటం చేసిన రష్మిక ఆ తర్వాత 2018 లో తెలుగు ప్రేక్షకులని చలో తో తనని ఫాలో అయ్యేలా చేసింది.
గీత గోవిందం, పుష్ప, యానిమల్ తో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని కూడా పొందింది. ప్రెజంట్ పుష్ప 2(pushpa 2)తో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ లో చేస్తుంది. ఇక కమల్ హాసన్ కూడా 25 లక్షలు ప్రకటించాడు. ఇదే బాటలో మరికొంత మంది నటీనటులు బాధితుల్ని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.
![]() |
![]() |