![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)జూనియర్ ఎన్టీఆర్(ntr)రామ్ చరణ్(ram charan)ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే. తెలుగు సినిమా ప్రేక్షకులకి అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఇక ముగ్గురి అభిమానులకి అయితే పండగే. ఆ పండగ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో కూడా చెప్పలేం.ఏంటి ఈ వార్త నిజమేనా అని మీలో అనుమానం రావడం సహజమే.కానీ నేను చెప్పబోయే విషయం వింటే మీ మైండ్ లో ఆ ముగ్గురి కాంబోలో మూవీ వస్తుందేమో అనే ఫీల్ ఖాయం.
తెలుగు సినిమాని ప్రపంచ సినిమాగా మార్చిన దర్శక ధీరుడు రాజమౌళి(rajamouli)గురించి నెట్ ఫ్లిక్స్ సంస్థ లేటెస్ట్ గా ఒక డాక్యుమెంటరీని షూట్ చేసిన విషయం అందరకి తెలిసిందే. జక్కన్న తో వర్క్ చేసిన హీరోలు, టెక్నీషియన్లు జక్కన్న తో తమకున్న అనుభవాల గురించి అందరితో పంచుకున్నారు. ఈ క్రమంలో చరణ్ మాట్లాడుతు మగధీర ని స్టార్ట్ చేసే కంటే ముందే సింహాద్రి(simhadri) మూవీని నాన్న చిరంజీవి చూసారు. అంతే కాదు మైండ్ బ్లోన్ అయ్యారని చెప్పాడు. ఇప్పుడు చరణ్ చెప్పిన ఈ రెండు మాటలు నెట్టింట ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రత్యేకించి ఎన్టీఆర్ ఫాన్స్ అయితే చరణ్ మాటలని ఫుల్ వైరల్ చేస్తున్నారు. చిరంజీవి సైతం ఆశ్చర్యపోయేలా సింహాద్రి ఉందని, అది తమ హీరో చిత్రమని ఒక రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతగా వైరల్ చెయ్యడానికి కారణం కూడా లేకపోలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరు ఎప్పటి నుంచో నెంబర్ వన్ హీరోగా ఉంటు వస్తున్నాడు.పైగా సింహాద్రి వచ్చిన టైం లో చిరు కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నాడు. పైగా వరుస ప్రాజెక్టు లతో బిజీ కూడాను. అలాంటిది ఆ టైం లో చిరు సింహాద్రి చూడటం గ్రేట్ అని చెప్పవచ్చు. ఇక సింహాద్రి 2003 లో వచ్చి అప్పటి వరకు వచ్చిన జక్కన్న ,ఎన్టీఆర్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి ఇంద్ర రికార్డులని కూడా క్రాస్ చేసింది. ఏది ఏమైనా చరణ్ వల్ల ఇద్దరి ఫ్యాన్స్ అప్పటి సినీ పోటీని మరోసారి గుర్తుచేసుకున్నారు.
![]() |
![]() |