![]() |
![]() |

ప్రస్తుతం 'దేవర', 'వార్-2' సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయిందని, షూటింగ్ కి ముహూర్తం కూడా ఖరారైందని తెలుస్తోంది. సెప్టెంబర్ చివరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. 'దేవర' రిలీజ్, 'వార్-2' షూట్ ఉండటంతో.. ఎన్టీఆర్ లేకుండానే మొదటి షెడ్యూల్ స్టార్ట్ అవుతుందట.
సెప్టెంబర్ 27న 'దేవర' విడుదల కానుంది. దాదాపు నెలరోజుల పాటు ఆ మూవీ ప్రమోషన్స్ ఎన్టీఆర్ బిజీగా ఉండే అవకాశముంది. అందుకే ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలతో నీల్ ప్రాజెక్ట్ షూట్ కాబోతుంది. మరోవైపు 'వార్-2' షూట్ కూడా పారలల్ గా జరగనుంది.
![]() |
![]() |