![]() |
![]() |
.webp)
మూవీ : చందు ఛాంపియన్
నటీనటులు: కార్తిక్ ఆర్యన్, విజయ్ రాజ్, భువన్ అరోర తదితరులు
రచన : కబీర్ ఖాన్, సుమిత్ అరోర, సుదిప్తో సర్కార్
సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ
ఎడిటింగ్: నితిన్ బైధ్
మ్యూజిక్: ప్రీతమ్, జులియస్ పాకియమ్
నిర్మాతలు: సాజిద్ నదియద్వాలా
దర్శకత్వం: కబీర్ ఖాన్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ :
ఈ కథ మహారాష్ట్రలోని సాన్గ్లీ గ్రామంలో మొదలవుతుంది. ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన అతడిని ఊరంతా కలిసి ఊరేగింపుగా తీసుకురావడం మురళీ పేట్ కర్ అనే కుర్రాడు చూస్తాడు. అది చూసి చాలా సంతోషిస్తాడు. ఇక తన అన్నని ఎందుకలా తీసుకొచ్చారని అడుగుతాడు మురళి. దేశానికి ఒలంపిక్ లో గోల్డ్ మెడల్ తెస్తే ఊరేంటి, దేశం మొత్తం భుజాల మీద మోస్తుందని వాళ్ళ అన్న మురళీకి చెప్పగా.. తను కూడా ఛాంపియన్ అవుతానని చెప్తాడు. అలా కావాలంటే కుస్తీ నేర్చుకొని పహిల్వాన్ అవ్వాలని మురళీకి వాళ్ళ అన్న చెప్పగా వాళ్ళ ఊరిలోని కుస్తీ నేర్పించే అతని దగ్గర జాయిన్ అవుతాడు. ఇక వాళ్ళ పక్క ఊరితో జరిగిన కుస్తీ పోటీలో గెలిచి మొదట తన ప్రతిభని తెలుసుకుంటాడు. ఇక పక్క ఊరివాళ్ళంతా తనని కొట్టడానికి వచ్చినప్పుడు అతను రన్నింగ్ ట్రైన్ ఎక్కేసి పారిపోతాడు. అప్పుడే అతనికి ఓ స్నేహితుడు పరిచయం అవుతాడు. తన ద్వారా ఆర్మీలో జాయిన్ అవుతాడు. మరి మురళీ అనుకున్న స్వప్నం నెరవేరిందా? చందు చాంపియన్ అయ్యాడా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమా మొదలవ్వడమే దేశానికి సేవలందించిన అందరు రాష్ట్రపతుల మీద కేసు పెడుతూ ఓ ముసాలయన వస్తాడు. అది చూసి స్టేషన్ లోని వారంతా నవ్వుతారు. ఇక అతను ఎందుకు కేస్ పెట్టాలనుకున్నాడో చెప్పడం మొదలెట్టగా అందరు విస్తుపోతారు. ఇది మురళి పేట్కర్ జీవిత కథ. ఒలపింక్ లో గోల్డ్ మెడల్ వచ్చినా కూడా సరైన గుర్తింపు లేని వాళ్ళు నాలాగా ఉన్నారంటు అతను కథ చెప్తూ ఉంటే ప్రతీ ఒక్కరు ఆ కథలోకి వెళ్ళిపోతారు.
ఒక్క అవకాశం ఇవ్వండి సర్ అని మురళి అడిగినప్పుడు తన కోచ్ టైగర్ ఇచ్చే అవకాశం అతని కథనే మార్చేసింది. ఇలాంటి ఇన్ స్పైరింగ్ జర్నీ చూస్తే రాకెట్ బ్రదర్స్, సూర్య చేసిన ఆకాశమే హద్దురా లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఇందులో చందు ఛాంపియన్ అని అందరు మరళిని వెక్కిరిస్తూ తనని చూసి నవ్వేవారికి దీటైన సమాధానం ఇస్తూ అంచెలంచెలుగా ఎదిగిన అతని కృషికి వీక్షకుడు ఇట్టే కనెక్ట్ అవుతాడు. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ కట్టిపడేస్తాయి. ముఖ్యంగా కోచ్ కి మురళికి మధ్య సంభాషణలు ఆయకట్టుకుంటాయి.
దేశం కోసం పోరాడిన సైనికులకి, దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిన వారికి సరైన గుర్తింపు లేదంటు చెప్పే ఈ కథ ఎంతోమందిని ఆలోచనలో పడేలా చేస్తుంది. సినిమా నిడివి కూడా పెద్దగా లేదు. ఫస్టాఫ్ తర్వాత మరళి కథే మారిపోతుంది. ఎవరు ఊహించని విధంగా అతని జీవితం మలుపులు తిరుగుతుంది. అడల్ట్ సీన్లు ఏమీ లేవు. అసభ్య పదజాలం వాడలేదు. కుటుంబంతో కలిసి చూసేలా ఉంది. నితిన్ భైద్ ఎడిటింగ్ బాగుంది. ప్రీతమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సుదీప్ చటర్జీ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
మురళి పేట్ కర్ గా కార్తిక్ ఆర్యన్ ఒదిగిపోయాడు. మరళి కోచ్ గా టైగర్ అలీ ఆకట్టుకున్నాడు. భువన్ అరోరా , యష్ పాల్ శర్మ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : ఫ్యామిలీతో కలసి చూసే ఓ చాంపియన్ కథ ఇది.
రేటింగ్ : 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |