![]() |
![]() |
.webp)
మాస్ ప్రేక్షకుల చేత థియేటర్స్ ల్లో డాన్స్ లు వేయించగలిగే సత్తా ఉన్న హీరోల్లో రవితేజ(ravi teja)కూడా ఒకడు. అందుకే ఏరి కోరి మాస్ మహారాజా టాగ్ లైన్ రవితేజ చెంతకు చేరింది. రెండున్నర దశాబ్దాల క్రితం ఇడియట్ తో మొదలైన సినీ విజృంభణ నేటికీ అదే రీతిలో కొనసాగుతూనే ఉంది. అందుకే నిదర్శనమే రవితేజ సాధించిన ఒక రికార్డు.
తాజాగా సోషల్ మీడియాలో 2020 స్టార్టింగ్ లో వచ్చిన కోవిడ్ మహమ్మారి తర్వాత ఏ హీరో ఇప్పటి వరకు ఎక్కువ సినిమాలు చేసాడనే చర్చ జరుగుతుంది. అందులో రవితేజ నెంబర్ వన్ గా నిలిచాడు. 2021 జనవరి 9 న క్రాక్ తో సూపర్ డూపర్ హిట్ సక్సెస్ ని అందుకున్నాడు. అంతే కాదు సినిమాకి నూతన జీవనాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా,చిరు తో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లాంటివి చేసాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అంటు వస్తున్నాడు. ఇలా 2021 నుంచి వరుసగా తొమ్మిది సినిమాలు చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా మాస్ మహారాజా సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. పైగా అంత ఫాస్ట్ గా చేసాడంటే అనుకోని ఆ సినిమాల క్వాలిటీ విషయంలో ఆలోచించాల్సిన పని లేదు. బడ్జట్, క్యాస్టింగ్ అండ్ టెక్నీకల్ పరంగా ఎంతో అత్యున్నతమైన సినిమాలు. మిస్టర్ బచ్చన్ అగస్ట్ 15 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది.
ఇక 2021 నుంచి మిగతా హీరోల లిస్ట్ చూసుకుంటే చిరంజీవి(chiranjeevi)ప్రభాస్(prabhas)నాని(nani) నాలుగు సినిమాలు, పవన్ కళ్యాణ్(pawan kalyan) బాలకృష్ణ(balakrishna)విజయ్ దేవరకొండ(vijay devarakonda)రామ్ పోతినేని(ram potineni)తలో ఒక మూడు సినిమాలు చేసారు. మహేష్(mahesh babu)చరణ్(charan)లు రెండు, ఎన్టీఆర్(ntr)ఒక సినిమా చేసారు.ఈ విధంగా కొవిడ్ విలయం తర్వాత హీరోలంతా టైమ్ తీసుకొని సినిమాలు చేస్తుంటే మాస్ మహారాజా మాత్రం జెట్ స్పీడుతో సినిమాలు చేస్తు ముందుకు దూసుకుపోతున్నాడు.
![]() |
![]() |