![]() |
![]() |
పెళ్లిసందడి చిత్రంతో హీరోయిన్ పరిచయమైన శ్రీలీల చాలా తక్కువ టైమ్‌లో బిజీ అయిపోయింది. రవితేజతో చేసిన ధమాకా ఆమెకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అంతేకాదు, ఆమె నటించిన సినిమాలు ఎక్కువ శాతం విజయాలు సాధించడంతో లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. గుంటూరు కారంలో ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌తో మాస్‌లో మంచి ఇమేజ్ సంపాదించింది. అయితే ఆ సినిమా తర్వాత ఆమె స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు, హీరోలు కూడా సిద్ధంగానే ఉన్నప్పటికీ ఆమె పెడుతున్న కండిషన్ వల్ల అవకాశాలు కూడా తగ్గాయి. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా తన కండిషన్‌కి అంగీకరిస్తేనే సినిమా చేస్తానంటోంది.
అదేమిటంటే.. తను ఏ సినిమాలో అయితే నటిస్తుందో అందులో తను మాత్రమే హీరోయిన్‌గా ఉండాలని, మరో హీరోయిన్ ఉంటే నటించేది లేదని తెగేసి మరీ చెబుతోందట. అందుకే కొత్త సినిమాలు ఎక్కువగా కమిట్ అవ్వడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. తనను సోలో హీరోయిన్‌గా బుక్ చేసుకునే వారైతేనే రమ్మని అంటోంది. కార్తీ హీరోగా రూపొందుతున్న సర్దార్ 2 చిత్రంలో అవకాశం వచ్చినా అందులో తను సోలో హీరోయిన్ కాదని తెలుసుకొని సింపుల్‌గా నో చెప్పేసిందట. అంతేకాదు, తమకు శ్రీలీలే కావాలంటూ బాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్‌ను కూడా రిజెక్ట్ చేసిందట. దానికి కూడా అదే కారణమంటున్నారు. ఇలాంటి కండిషన్స్ పెట్టడం వల్ల అవకాశాలు ఖచ్చితంగా తగ్గుతాయని పరిశ్రమలోని వారే చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే శ్రీలీల మునుపటిలా వెరీ బిజీగా అయితే లేదు. మునుపటిలా లెక్కకు మించిన బిజీ అవ్వాలంటే తను పెట్టిన కండిషన్ విషయంలో ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఈ విషయంలో శ్రీలీల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
![]() |
![]() |