![]() |
![]() |

సినీ సెలబ్రిటీస్,రాజకీయ నాయకులు ఎప్పుడు కలిసినా కూడా ఏదో తెలియని వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అలా కలగడానికి ప్రత్యేక కారణాలు కూడా అక్కర్లేదు. ఆ ఇద్దరి డిజిగ్నేషన్స్ కి సొసైటీ లో ఉన్న క్రేజ్ అది. తాజాగా పవన్ కళ్యాణ్(pawan kalyan)మాజీ వైఫ్ రేణు దేశాయ్(renu desai)తెలంగాణ మంత్రి కొండా సురేఖ(konda surekha)కలిశారు. అసలు వీళ్ళద్దరు కలవడానికి రీజన్ ఏంటి! ఏం జరిగిందో చూద్దాం.
వరంగల్ ఏంఎల్ ఏ అయిన కొండా సురేఖ ప్రస్తుతం దేవాదాయ ధర్మశాఖ తో పాటు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కి రేణు దేశాయ్ చీఫ్ అడ్వైజర్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే సురేఖ ని ఆమె నివాసంలో కలిశారు. వన్నె ప్రాణుల సంక్షేమం, పర్యావరణం, ఆధ్యాత్మిక రంగాలలో లాంటి విషయాలపై చర్చించారు. అన్ని విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లి చర్చించాలో ఇద్దరు మాట్లాడుకున్నారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా నెలకొల్పిన గీత యూనివర్సిటీ కి సంబంధించిన విషయాల గురించి కూడా రేణు దగ్గర్నుంచి సురేఖ గారు అడిగి తెలుసుకుంది. అదే విధంగా రేణు విషయాన్నీ సురేఖ గారు ఎక్స్ వేదికగా కూడా వెల్లడి చేసారు
ఇక ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో రేణు దేశాయ్ మరి ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లి పవన్ ని కలుస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ ఇప్పుడు పంచాయితీ రాజ్ తో పాటు అటవీ అండ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాడు. పవన్ ని కలిసి ప్రకృతి గురించి మాట్లాడాలి కదా అని అంటున్నారు.
![]() |
![]() |