![]() |
![]() |

పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ ఘడియలు దగ్గరకి రాగానే పెళ్ళికి సంబంధించిన బట్టలు పలానా చోట కొనాలని ఫిక్స్ అవుతాం. ప్రస్తుత బిజీ లైఫ్ లో ఇంకాస్త ముందే ఫిక్స్ అయ్యే పరిస్థితి. రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)కి కూడా ఆ శుభ ముహూర్తం దగ్గర పడిందనుకుంటా! పెళ్లి బట్టలు టాపిక్ ప్రభాస్ ఇంటి చుట్టు తిరుగుతుంది.
రీసెంట్ గా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ప్రముఖ సారీస్ స్టోర్ ఓపెన్ అయ్యింది. పేరు ఈ జరివరం. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(shyamala devi)స్టోర్ ని సందర్శించారు. స్టోర్ మొత్తం పరిశీలించి అక్కడున్న కంచి పట్టు చీరలని గుర్తించి పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది.నాకు కంచి పట్టు చీరలంటే చాలా ఇష్టం.కృష్ణం రాజు(krishnam raju) గారు కూడా నాకు కొన్న మొట్టమొదటి చీర కంచి పట్టు చీరనే.అలాగే ప్రభాస్ పెళ్లికి ఈ జరివరం నుంచే బట్టలు కొంటామని చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ మాటలు హాట్ టాపిక్ గా నిలిచాయి. అదే విధంగా రీసెంట్ గా వినిపిస్తున్న ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమే అయ్యుంటుందని, ప్రభాస్ పెళ్లి ముహూర్తం దగ్గరలో ఉంది కాబట్టే ఆ మాట చెప్పిందని అంటున్నారు.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటినుంచో తమ డార్లింగ్ ఒక ఇంటి వాడు కావాలని ఆశపడుతున్నారు. ఇక లేడీ ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు అసూయపడుతున్నారు. ఈ జరివరం స్టోర్ ని ప్రముఖ హీరో, నటుడు అయిన కృష్ణుడు భార్య స్థాపించింది. వినాయకుడు తో కృష్ణుడు ఎంత గుర్తింపు పొందాడో అందరకి తెలిసిందే. ఆ తర్వాత చాలా చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలే పోషించాడు.ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి బట్టల వార్తలతో కృష్ణుడు స్టోర్ కి ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.
![]() |
![]() |