![]() |
![]() |
దళపతి విజయ్‌కు తమిళనాడులో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందుకే త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ‘ది గోట్’ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత హెచ్.వినోద్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అది విజయ్ 69వ సినిమా. ఈ సినిమాయే అతని చివరి సినిమా అనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు.
ఇదిలా ఉంటే.. స్టార్ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి ఓ సంచలన ప్రకటన చేశాడు. అది చూసి అందరూ షాక్ అవుతున్నారు. అదేమిటంటే.. విజయ్ అంటే తనకెంతో ఇష్టమని, అతను ఒప్పుకుంటే తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యాలన్న కోరిక ఉందని చెబుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని చెబుతున్నాడు. తన దగ్గర మూడు బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయని, విజయ్ ఒప్పుకుంటే తను అతనితో సినిమా చేసేందుకు రెడీ అంటున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలవడంలో స్పిన్నర్ వరుణ్ కీలక పాత్ర పోషించాడు. తనకు ఫిలిం మేకింగ్ అంటే ఎంతో ఇష్టమని చెబుతున్న వరుణ్ తనలోని క్రియేటివిటీని చూపించేందుకు సినిమా అనే మీడియం ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నాడు. ఇప్పటికే సినిమాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన విజయ్.. ఇప్పుడు వరుణ్ చేసిన ప్రకటనతో ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం.
![]() |
![]() |