![]() |
![]() |

1974లో విడుదలైన 'తాతమ్మ కల' చిత్రంతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) .. ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఘనంగా వేడుక నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
బాలయ్య 50 ఏళ్ళ వేడుక గెస్ట్ ల లిస్టు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ భాషల సినీ స్టార్స్ అందరూ రాబోతున్నారట. అలాగే రాజకీయ ప్రముఖుల లిస్టు కూడా భారీగా ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారట. కేంద్ర మంత్రులను సైతం ఇన్వైట్ చేస్తున్నారట.
![]() |
![]() |