![]() |
![]() |

సినీ గ్లామర్ ముందు రూమర్ కూడా నిలబడలేదు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఐ మీన్ ఏ కాంబో సిల్వర్ స్క్రీన్ మీద అడుగులు మోపడానికి రెడీ అవుతుందా అని. తాజాగా చిరంజీవి(chiranjeevi)నూట యాభై ఏడవ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ విషయంలో సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతుంది. ఇందులో కొత్తేముంది. ఒక మోస్తరు హీరో విషయంలోనే జరుగుతుంది. అలాంటిది మెగాస్టార్ డైరెక్టర్ విషయంలో జరగదా ఏంటని అనుకోకండి. ఈ సారి జరిగే చర్చ మాత్రం అంతకు మించి..
సందీప్ రెడ్డి(sandeep reddy vanga)ఇప్పుడు ఈ పేరు చెబితే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఫుల్ వైబ్రేషన్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ తో ప్రేక్షకులకి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు.పైగా ఇది సందీప్ రెడ్డి సినిమా అని చెప్పుకునే స్థాయి కూడా ఎదిగాడు. ఇక కలెక్షన్ల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఇండియన్ టాప్ టెన్ మూవీస్ లో ఒకటిగా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చిరు నూట యాభై ఏడవ సినిమాకి సందీప్ దర్శకత్వం వహిస్తాడనే ప్రచారం జరుగుతుంది. దీంతో చాలా మంది ఇది పుకారు మాత్రమే అంటున్నారు. ఎందుకంటే సందీప్ ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మేరకు నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి.అలాంటిది చిరు తో సినిమా ఎలా సాధ్యం అంటు కామెంట్స్ చేస్తున్నారు.
వాళ్ళు అనుకునేది నిజమే. చిరు విశ్వంభర(vishwambhara)నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వబోతుంది. ఆ తర్వాత కొంత విరామం తీసుకోవడం పక్కా. ఇక ప్రభాస్ (prabhas)స్పిరిట్(spirit) ఈ ఇయర్ షూట్ కి వెళ్లినా కూడా భారీ సినిమా కాబట్టి రిలీజ్ కి టైం పట్టవచ్చు. సో ఇప్పుడప్పుడే సినిమా అంటే కష్టం. ఇక ఈ న్యూస్ చూసిన మెగా అండ్ సందీప్ ఫ్యాన్స్ కొంచం లేటుగా అయినా ఆ ఇద్దరి కాంబోలో సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవికి ఉన్న లక్షలాది మంది అభిమానుల్లో ఎవరకి చిరు అంటే ఎక్కువ అభిమానం ఉందని పోటీ పెడితే సందీప్ నే గెలుస్తాడు. ఈ విషయాన్నీ స్వయంగా సందీప్ నే చెప్పాడు.
![]() |
![]() |