![]() |
![]() |

వెబ్ సిరీస్: బహిష్కరణ
నటీనటులు: అంజలి, అనన్య నాగళ్ల, శ్రీతేజ, రవీంద్ర విజయ్ , షణ్ముఖ్, మెహబూబ్ భాషా తదితరులు
ఎడిటింగ్: గిరజాల రవితేజ
మ్యూజిక్: సిద్దార్థ్ సదాశివుని
సినిమాటోగ్రఫీ: ప్రసన్న కుమార్
కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం: ముకేశ్ ప్రజాపతి
ఓటీటీ: జీ 5
అంజలి, అనన్య నాగళ్ల, శ్రీతేజ, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'బహిష్కరణ'. దర్శకుడు ముకేశ్ ప్రజాపతి రూపొందించిన ఈ సిరీస్ తాజాగా జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథేంటో ఓసారి చూసేద్దాం..
కథ:
1990లలో గుంటూరు జిల్లా పెద్దపల్లి నేపథ్యంలో కథ నడుస్తుంటుంది. ఆ గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్) సర్పంచ్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ ఊళ్లో అతను ఏది చెప్తే అదే సాగుతుంది. శివయ్యకి నమ్మిన బంటు దర్శి (శ్రీతేజ్) కాగా.. సూరి (షణ్ముఖ్) అతని ప్రధానమైన అనుచరుడిగా ఉంటాడు. దర్శికి లక్ష్మి(అనన్య నాగళ్ల) అనే మరదలు ఉంటుంది. చిట్టి (మహబూబ్ బాషా) అనే స్నేహితుడు ఎప్పుడు చూసినా దర్శితోనే తిరుగుతుంటాడు. ఇక ఆ ఊరిలోకి పుష్ప (అంజలి) అనే వేశ్య వస్తుంది. సర్పంచ్ శివయ్య దగ్గరకి నేరుగా వెళ్లిన పుష్పకి ఊరి చివర మకాం ఏర్పాటు చేస్తాడు. కొన్ని రోజులకి పుష్ప, దర్శి ప్రేమలో పడతారు. ఆ విషయం శివయ్యకి చెప్తారు. పుష్పని దక్కించుకోవాలనుకున్న శివయ్య ఏం చేశాడు? అసలు పుష్ప నిజంగానే వేశ్యా? దర్శి ప్రేమ ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ కథ పాతదే.. కానీ దర్శకుడు ముకేశ్ ప్రజాపతి చక్కని స్క్రీన్ ప్లే తో విజయపథంలో నడిపించాడు. అసలు ఓ వేశ్య పాత్రని రాసుకున్న తీరుకి ఈ సిరీస్ చూసే ప్రేక్షకుడు ఫిదా అవ్వాల్సిందే. పూర్వం తక్కువ కులాల వారిని బహిష్కరణ పేరుతో ఊరికి చివరన ఉంచడం, వారిని హింసించడం లాంటివి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ ఎపిసోడ్ ముగింపులో వచ్చే ట్విస్ట్ మిగతా ఎపిసోడ్ లపై ఆసక్తిని పెంచుతుంది.
మొదటి ఎపిసోడ్ డెడ్ ఫిష్.. ఆసక్తికరంగా సాగింది. బ్యాక్ డ్రాప్ లో ఏదో జరిగిందనే క్యూరియాసిటిని పెంచుతూ ఎండింగ్ ఉంటుంది. రెండవది బ్రేవ్ హార్ట్ .. డైరెక్ట్ ఫ్లాష్ బ్యాక్ లోకే వెళ్తుంది కథ. అక్కడ ఏం జరిగిందనేది క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మూడవ ఎపిసోడ్ డెవిల్ ఇన్ సైడ్.. 33 నిమిషాలు ఉంటుంది. మంచి డ్రామా క్రియేట్ అయింది. నాల్గవ ఎపిసోడ్ న్యూ బిగినింగ్.. ఇందులో అనన్య నాగళ్ల పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఐదో ఎపిసోడ్ లలో కథ పూర్తిగా వివరించే ప్రయత్నం చేయగా.. చివరి ఎపిసోడ్ లో మోస్ట్ ఎమోషనల్ గా కథని మలుపు తిప్పే ట్విస్ట్ ఉంటుంది. ఎపిసోడ్ చివరలో ఓ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ చూపిస్తూ ముగించేశారు. అంటే మరో పార్ట్ ఉండబోతుందంటూ దర్శకుడు ముగించాడు.
అక్కడక్కడ నెమ్మదిగా సాగినా.. కథ మెప్పిస్తుంది. ఈ సిరీస్ లో డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. అయితే రొమాన్స్, లిప్ లాక్ సీన్లు ఎక్కువ డిస్టబ్ చేస్తాయి. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ విసుగు తెప్పిస్తాయి. ఫ్యామిలీతో కలిసి చూసేలా లేదు ఈ సిరీస్. గ్రామీణ వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించడంలో ప్రసన్న కుమార్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. సిద్ధార్థ్ సదాశివుని బాణీలు మంచి ఫీల్ తో సాగుతాయి. బిజిఎమ్ కొన్ని చోట్ల బాగుంది. రవితేజ గిరజాల ఎడిటింగ్ నీట్ గా ఉంది.
నటీనటుల పనితీరు:
దర్శి పాత్రలో శ్రీతేజ ఆకట్టుకున్నాడు. పుష్ప పాత్రలో అంజలి, లక్ష్మీగా అనన్య నాగళ్ల ఒదిగిపోయారు. అంజలి పర్ఫామెన్స్ పీక్స్ ఉంటుంది. అనన్య నాగళ్ళ డైలాగ్ డెలివరీ బాగుంది. శివయ్యగా రవీంద్ర విజయ్ ఫ్రధాన బలంగా నిలిచాడు. ఇక మిగతా వారు వారి పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా..
ఓ వర్గం ప్రేక్షకులకి నచ్చే ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్.
రేటింగ్ : 2.5/5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |