![]() |
![]() |
.webp)
ఈమధ్య కాలంలో భారీ సినిమాలు కూడా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ప్రభాస్ (Prabhas) గత చిత్రం 'సలార్' నాలుగు వారాలకే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే బాటలో ప్రభాస్ తాజా చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) పయనిస్తుందని భావించారంతా. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఓ న్యూస్ వినిపిస్తోంది.
'కల్కి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదలైన పది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ లెక్కన వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సమాచారం.
'కల్కి' ఓటీటీ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. ఇప్పటికే 'కల్కి' బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అసలే ఇది ఖచ్చితంగా థియేటర్ లో అనుభూతి చెందాల్సిన సినిమా అని టాక్ రావడం, దానికితోడు ఓటీటీ విడుదల ఇప్పట్లో లేదని తెలియడంతో.. థియేటర్లలో మరికొద్ది రోజుల పాటు 'కల్కి' ప్రభంజనం కొనసాగే అవకాశముంది.
![]() |
![]() |